Site icon TeluguMirchi.com

సమయం లేదు మిత్రమా.. విశ్రాంతి తీసుకోవడం లేదు !

ప్రపంచ కప్ కి సమయం లేదు మిత్రమా. అందుకే తనకి రెస్ట్ కూడా లేదు అంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.
ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా.. జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను పాండ్య సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ప్రపంచ కప్‌ ముందుండటం వల్ల ఎలాంటి విశ్రాంతి తీసుకోవట్లేదని కామెంట్ పెట్టాడు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పాండ్యను ప్రశంసిస్తున్నారు. ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వెచ్చిస్తున్నాడు. ఈ నెల 30 నుంచి ప్రపంచ కప్‌ మొదలు కానుంది. ఇందుకోసం టీమిండియా ఈ నెల 22న ఇంగ్లాండ్‌ బయల్దేరి వెళ్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరూ 21వ తేదీనే ముంబయి చేరుకోవాలని బీసీసీఐ సూచించింది.

Exit mobile version