మేధావులూ, జబర్దస్త్ నటులూ ‘ పురాణపండ ‘ గణపతినే ఇష్టపడ్డారు

ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈ సంవత్సరం ఒక అనిర్వచనీయమైన ఆనందంలా అందించిన మహాగణపతి మంగళగ్రంధం తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఆకట్టుకుంది. అమోఘమైన మంత్రశక్తులతో, అద్భుతమైన వ్యాఖ్యానాలతో అపురూప విలక్షణమైన చిత్రాలతో లక్షలమందిని ఆకర్షించిన ఈ గ్రంధంపేరు … ‘ నిన్ను నే గొల్చెదన్ ‘. పురాణపండ శ్రీనివాస్ ఈ పుస్తకం తీసిన విధానం ధ్వన్యాత్మకమైన అద్భుత సంబోధనల రచనా శైలి గణపతి భక్తుల హృదయాలను కొల్లగొట్టింది.

ఈసారి వినాయక చవితి పండుగకు పదిరోజులముందే ఈ మహాద్భుతగ్రంధం తెలుగు రాష్ట్రాల్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. గణపతి భగవానుని సర్వదేవతాత్మక స్వరూపంగా, పరమార్ధ సార్ధకంగా అందిన ఈ మంగళ గణపతి మంచి పుస్తకాన్ని వరుసగా నాలుగు రోజులూ నాలుగు ప్రాంతాలలో ఆవిష్కరించి …. లక్షల కొలది భక్తులకు అందించడంతో పురాణపండ శ్రీనివాస్ పై ప్రశంసల వెల్లువ పొంగులెత్తింది.

వారం రోజుల ముందే కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఉన్నతాధికారి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ. వెంకటేష్ ఆవిష్కరించడంతో ప్రారంభమైన ఈ ఒకే ఒక్క చక్కని పుస్తకాన్ని హైదరాబాద్ లో రామకృష్ణ మఠాధిపతులు జ్ఞానదానందజీ మహారాజ్, రాజమండ్రి జ్ఞానసరస్వతీ దేవాలయంలో కోస్తాజిల్లాల వర్తక సంఘాల సమాఖ్య కన్వీనర్ అశోక్ కుమార్ జైన్, విశాఖపట్నం భారతీయ జనతాపార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశంలో కేంద్ర సహాయమంత్రి శ్రీమురళీధరన్ , నెల్లూరు వైఎస్సార్సీపీ ప్రత్యేక సమావేశంలో ఆత్మకూర్ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , నగరిలో ఎమ్మెల్యే రోజా ఈ అమోఘ ప్రాస్త్యాల విఘ్నేశ్వరుని గ్రంధాన్ని ఆవిష్కరించారంటే ఈ పుస్తక నిర్మాణం, రచనలో పురాణపండ శ్రీనివాస్ ఘనతను మనమంతా అభినందించి తీరాలి.

వినాయకుని వరేణ్య వైభవంగా అలరారుతున్న ఈ గ్రంధం చూస్తుంటేనే ఒక గొప్ప పారవశ్యం కలుగుతోందని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు గుప్పించారంటే ఎంతటి గణపతి అనుగ్రహంగా ఈ గ్రంధం అలరారుతోందో అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం పురాణపండ ను విశేషంగా అభినందించారు. ఇక పోతే … ఇల్లిల్లూ నవ్వులతో ముంచెత్తుతున్న జబర్దస్త్ టీం కూడా ఈసారి పురాణపండ శ్రీనివాస్ పుస్తకానికే జేజేలు కొట్టి పురాణపండ కు, గ్రంధాన్ని బహూకరించిన రోజాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం కూడా విశేషమే. ఇలా చెప్పుకుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల అప్రతిహత జైత్రయాత్ర మామూలుగా లేదనే చెప్పాలి.

తెలంగాణా, ఆంధ్రాలో ఎన్నో పారిశ్రామిక సంస్థలు , చలచిత్ర సంస్థలు ఎంతో సౌహార్దతతో పురాణపండ కు యజ్ఞ భావనకు వెన్నుగా నిలవడం భగవంతుని అనుగ్రహమే. ఎప్పటిలా మళ్ళీ పురాణపండ ఈ వినాయక చవితికి కూడా రచయితగా, ప్రచురణకర్తగా మళ్ళీ అగ్రతాంబూలం పుచ్చూకోవడం వెనుక నిస్వార్ధ భావన , తపశ్శక్తి అని వొప్పుకోవసిందేనని ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ కూడా గొంతెత్తడం మరియొక మంచి విశేషం.

గ్రంథ సమర్పకులైన ‘ మహానటి ‘ దర్శకులు నాగ్ అశ్విన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బిజెపి ఆధికారిక స్పోక్స్ పర్సన్ డాక్టర్ సుహాసిని ఆనంద్, నగరి శాసన సభ్యురాలు రోజా, నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి , శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం చైర్మన్ తోట సుబ్బారావు, సంతోషం ఎడిటర్ సురేష్ కొండేటి తదితర ప్రముఖులకు భక్త బృందాలు కృతజ్ఞతలు తెలపడం ఒక పతాకమైతే వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజని దంపతులు ఈ అక్షరకార్యానికి శ్రీకారం చుట్టడం వలన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కాణిపాకం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పేర్కొనడం మరొక వాస్తవం . అంతా కాణిపాకం గణపతి దయేనంటున్నారు భక్తజనం.