రాష్ట్రాలవారీగా రెమ్‌డెసివిర్‌ కేటాయింపులు

అన్ని రాష్ట్రాల రెమ్‌డెసివిర్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 16 వరకు కొరత రాకుండా, దేశవ్యాప్తంగా చేసిన ఔషధాల కేటాయింపులను కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ ప్రకటించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఆటంకాలు లేకుండా డెమ్‌డెసివిర్‌ పంపిణీ జరుగుతుందని, రోగులెవరూ ఇబ్బంది పడరని చెప్పారు.

కేంద్ర ఔషధ విభాగం, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కలిసి అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాశాయి. ఈ నెల 1న డీవో ద్వారా వెల్లడించినట్లు, ఏప్రిల్ 21- మే 9వ తేదీ వరకు రూపొందించిన రెమ్‌డెసివిర్ కేటాయింపు ప్రణాళికకు కొనసాగింపుగా, ఏప్రిల్‌ 21 – మే 16వ తేదీ వరకు మార్చిన వ్యవధి కోసం కేంద్ర ఔషధ విభాగం, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కలిసి తాజా ప్రణాళిక రూపొందించినట్లు ఆ లేఖలో సంయుక్తంగా పేర్కొన్నాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రెమ్‌డెసివిర్‌ల కేటాయింపు జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య సరైన విధంగా వాటి కేటాయింపు జరిగేలా; ఆయా సంస్థలు వాటిని సక్రమంగా, న్యాయబద్ధంగా ఉపయోగించేలా పర్యవేక్షించాలని ఆయా ప్రభుత్వాలను కేంద్రం కోరింది.

ఆంధ్రప్రదేశ్ కి 2.35 లక్షలు, తెలంగాణ కి 1.45 లక్షల డోసులు ప్రకటించింది.

ఏప్రిల్ 21-మే 16 మధ్య కాలానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 1న చేసిన కేటాయింపులు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి: