Site icon TeluguMirchi.com

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ రోజర్ ఫెదరర్ దే

roger fedarerఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ ను రోజర్ ఫెదరర్ దక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆయన ఫ్రాన్స్ క్రీడాకారుడు ఫెయిర్‌పై 6-2, 6-4, 6-1 స్కోర్ తేడాతో ఈ విజయం సాధించారు. ఆట అనంతరం విలేఖరులతో ముచ్చటిస్తూ ప్రపంచ నంబర్‌-2 ర్యాంకులో కొనసాగుతున్న 32 ఏళ్ల రోజర్‌ ఫెదరర్‌ ఇప్పటి ఇంకా తాను యువకున్నే అని అంటున్నాడు. స్వి ట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్ తాను ఇంకా అత్యుత్తమమైన టెన్నిస్‌ను ఆస్వాదిస్తానని, మరికొన్ని సంవత్సరాల వరకు కెరీర్‌లో కొనసాగే సత్తా ఉందని అంటున్నాడు. తాను ఇప్పటి వరకు తాను 17 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఇద్దరు పిల్లలకు తండ్రిగా కూడా రికార్డులు సాధించి ప్రస్తుతం ప్రపంచ నంబర్‌-2 క్రీడాకారుడిగా ఉన్నానని అన్నాడు. ఇప్పటికీ తాను మరిన్ని టైటిల్స్‌ సాధించగలననే నమ్మకం ఉందన్నాడు.

Exit mobile version