RRR , KGF చిత్రాలు పురాణపండ శ్రీనివాస్ కీర్తిని మ్రోగిస్తున్నా శ్రీనివాస్ ఏం పట్టించుకోరు

Puranapanda Srinivas

హైదరాబాద్ : ఏప్రిల్ : 19

మానవ జీవనవిధానానికి, సమాజ సంస్కృతులకు ఉపయోగపడే విశేషాలెన్నింటినో చక్కగా వివరించే పరమ రమణీయగ్రంథాలెన్నింటినో రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల తెలుగు వాకిళ్ళలో తానే ఒక శోభాయమాన మహాగ్రంధంగా నిలిచిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఒక్క సారిగా RRR తో , KGF – 2 మహా చిత్రాలతో కోట్లాది భారతీయుల్ని ఆకర్షించారు.

పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించి , అన్ని సినిమాలూ ఘన విజయాలు సాధించేలా చేసి , ఈ దేశప్రేక్షక లోకానికి ఎదురులేని దర్శక ధీరుడిలా విజయాలపతాకమై వెలుగుతున్న ఎస్సెస్ రాజమౌళి సంచలనాత్మక దృశ్యకావ్యం RRR చిత్రం ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించింది ఒకే ఒక వ్యక్తి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కి మాత్రమే !

అలానే … ఈ దేశమంతటా సునామీ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న KGF -2 తెరపై కూడా అపూర్వమైన రీతిలో పురాణపండ శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్నతలు చెప్పడం కోట్లాదిమందిని ఆకర్షించిన విశేషమని చెప్పాలి. మేధో సమాజం శ్రీనివాస్ నిరంతర కృషికి ఆశ్చర్య పోవాల్సిందే.

పురాణపండ శ్రీనివాస్ ….. అనగానే మనకి అసాధారణ ప్రతిభ, అద్భుతమైన గ్రంధాలతో పాటు రాజీపడని వొక విలక్షణ మనస్తత్వం , అపూర్వమైన నిస్వార్ధత ఠక్కున గుర్తొస్తాయి.

శ్రీనివాస్ మహోత్కృష్ట గ్రంధరాశికి ఈ దేశ హోంశాఖామంత్రి అమిత్ షా సైతం ఆకర్షించబడి , అభినందనలు వర్షించడం వొక గొప్ప విశేషమైతే , గత ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య , నేటి ముఖ్య మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు , వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి దిగ్గజ ముఖ్యమంత్రులందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క ఆర్షధర్మ గ్రంధాన్ని ఆవిష్కరించి ప్రశంసలు వర్షించడం లక్షలమంది రసజ్ఞులకూ తెలిసిన విషయమే.

అయితే .. దేశమంతటా కోట్ల రూపాయలను వర్షిస్తున్న RRR , KGF -2 వంటి మహోన్నత చిత్రాల వెండితెరలపై పురాణపండ శ్రీనివాస్ ఫోటోతో మెరుస్తున్న విశేషాన్ని చూసిన చాలామంది రాజకీయ నేతలు, కవులు, రచయితలు, సినీరంగ ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ కి అభినందనాలంటూ కరచాలనం చేస్తూంటే … శ్రీనివాస్ దూరంగా జరుగుతూ … వీటికి సమాధానంగా చిరునవ్వుతో వేంకటేశ్వర స్వామి ఫోటో చూపిస్తున్నారుట.

RRR Movie

శ్రీనివాస్ ఏమీ పట్టించుకోరు. నిదుర లేచింది మొదలు నిద్రించే వరకూ ఆయన ప్రతీ ఘటనను తిరుమల శ్రీనివాసుని చలవేనంటారు. తిరుమల శ్రీవారిపై శ్రీనివాస్ కి వున్నఅపార విశ్వాసం అంతా ఇంతాకాదు.

శ్రీనివాస్ ఆపత్కాలాలను ఒంటరిగా ఎదుర్కొన్నప్పుడు … శ్రీనివాస్ కి అన్నీ తానై నిలిచింది వేంకటేశ్వర స్వామి వారేనని ఆయన సన్నిహితులే చెబుతారు.

శ్రీనివాస్ ఏదీ పట్టించుకోరు. ఎందులోనూ రాజీ పడరు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం శ్రీనివాస్కి ఇష్టం ఉండదు. చాలామందికి దూరంగా వుంటారు. మీడియా పిచ్చికి కూడా చాలా దూరంగా వుంటారు. మరీ ముఖ్యంగా స్వార్ధ ప్రయోజనాలకోసం తహ తహ లాడేవారు ఎంతటివారినైనా శ్రీనివాస్ తన దగ్గరికి రానివ్వరు. వీలైనంతవరకూ తానే సహకారం చెయ్యడానికి శ్రీనివాస్ ప్రయత్నిస్తారు. దైవకార్యం తప్ప మరే ఇతర కార్యం ఎవ్వరు అడిగినా చెయ్యరు గాక చెయ్యరు. వాళ్లకి దైవం విలువ తెలుస్తుందని ఊరుకుంటారు. భౌతిక ప్రమాణాలపట్ల, భౌతిక అంశాల పట్ల శ్రీనివాస్ అస్సలు ఆసక్తి చూపరు. ఆయన దైవబలంతో, మనోబలంతో సాగిపోతారు.

శ్రీనివాస్ మనస్తత్వం తెలుసుకాబట్టే ఎందరో సినీరంగ ప్రముఖులు, ఎందరెందరో రాజకీయ ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ మేధోగ్రంధాలను తలలకెత్తుకున్నారు. సమర్పకులుగా సౌజన్యాన్ని అందించారు. శ్రీనివాస్ శైలికి , అపురూప గ్రంథ నిర్మాణానికి లక్షలకొలది ఫాలోయర్స్ ఉన్నారనేది మన కట్టెదుర కనిపించే సత్యం.

కాబట్టే దర్శక ధీరుడంతటి వాడు రాజమౌళి తన RRR మహాద్భుత చిత్రంలో శ్రీనివాస్ ని తెరపై ఫోటోతో చూపించారు. ఆయనమాత్రమే కాదు KGF -2 చిత్రం శ్రీనివాస్ పేరు ప్రకటించిన విధానం కోట్ల ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరుస్తోంది.

KGF Chapter 2

రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పేరు ఇప్పుడు దేశమంతటా ఈ రెండు మహా చిత్రాలతో ఇంకా మారుమ్రోగుతోంది. అయినా శ్రీనివాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిరాడంబరంగా అలానే దైవబలంతో మంత్రబలాలను
తెలుగు లోగిళ్ళకు సమర్పిస్తూనే వున్నారు. ఇలాంటి పవిత్ర మనస్తత్వానికి ప్రేక్షకలోకం , పాఠక లోకం హాట్స్ ఆఫ్ చెబుతోంది. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న రెండు పాన్ ఇండియా మూవీస్ లో ఒకేసారి ఒకే రచయితకు ఇంతటి ఘనత దక్కడం మామూలు విషయం కాదని సినీ విశ్లేషకులు పేర్కొనడం పురాణపండ శ్రీనివాస్ చెప్పినట్లు శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహమే అని నొక్కి చెప్పాల్సిందే.