ఒక సంవత్సరంలో సూర్య కుమార్‌ ఎన్ని సిక్సులు బాదాడో తెలుసా ?


టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌గా అవతరించిన సూర్య కుమార్‌ యాదవ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సూర్య పేరును ఐసీసీ ప్రకటించింది. 2022లో 31 మ్యాచ్‌లాడిన సూర్య 46.56 సగటు, 187.43 స్ట్రయిక్‌ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలున్నాయి. ఈ క్రమంలో సూర్య 68 సిక్సర్లు, 106 ఫోర్లు బాదాడు. టీ20 చరిత్రలో ఒక ఏడాదిలో ఇన్ని సిక్స్‌లు కొట్టిన ఏకైక బ్యాటర్‌ సూర్యనే.