రూ. 300 దర్శన టికెట్ల జారీలో మార్పులు చేయనున్న టీటీడీ

దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలను అనుసరించాల్సిందిగా సూచించింది.

ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కొవిడ్‌ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే రానున్న 90 రోజుల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో ఏప్రిల్‌ 11 నుంచి టైంస్లాట్‌ టోకెన్ల కోటాను కూడా రద్దు చేశారు.