పరిషత్ ఎన్నికల నుంచి సైకిల్ ఔట్ !

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎస్ఈసీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే రంగంలోకి దిగిన నీలం సాహ్నీ.. ఎన్నికల కమిషనర్ సెక్రటరీ కన్నబాబుతో పాటు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిసల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

మరోవైపు  పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలు ఏ మాత్రం స్వేచ్చగా జరిగే అవకాశం లేకపోవడం.. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడం ఖాయమని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఎస్ఈసీ నీలం సాహ్నిని నిమిత్తమాత్రంగానే ఉంచుతారని.. అంతా ఇతరులు పనులు పూర్తి చేసి.. ఏపక్షంగా పోలింగ్.. కౌంటింగ్ నిర్వహింప చేసుకుంటారని ఇంత మాత్రం దానికే.. ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.