Site icon TeluguMirchi.com

పెథాయ్‌ ఎఫెక్ట్ : ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు..

దూసుకస్తోన్న పెథాయ్‌ తుఫాన్ తో ఏపీ లోని ప్రజలంతా వణికిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలంతా భయపడుతున్నారు. మరో రెండు మూడు గంటలలో తీరం దాటడంతో ఆ సమయంలో గంటకు 80 నుండి 120 మధ్య గాలి వీస్తోందని అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాల ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ఈ తూఫాన్ వల్ల స్కూల్ కు సెలవులు ప్రకటించారు. దాదాపు 21 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. ఈ తూఫాన్ ఎఫెక్ట్ ఏ ఏ ప్రాంతాలపై అధికంగా ఉంటుందంటే..

నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృతివెన్ను, అవినిగడ్డలో భారీ వర్షం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు, తుని, తొండంగి.. విశాఖ జిల్లాలో విశాఖ‌, గాజువాక‌, భీమునిప‌ట్నం, ప‌ర‌వాడ, పెద‌గంట్యాడ‌, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌. రాయ‌వ‌రం, పాయ‌కరావుపేట‌..శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, గార‌, ప‌లాస‌, వ‌జ్రపుకొత్తూరు, మంద‌స‌, సంత‌బొమ్మాళి, క‌విటి, ఇచ్చాపురం.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటిరేగ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Exit mobile version