ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం.

అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.

కొత్తగా జైన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు ఆమోదం.
పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం.

రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.

ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనగణనను 2021 జనాభా లెక్కల ప్రక్రియలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణకు అధికారాన్ని ఇస్తూ చేసిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం

1965 సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించి ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా టిక్కెటింగ్ పద్ధతి ప్రవేశ పెట్టాలనే తీర్మానానికి మంత్రివర్గం ఆమోదంపాల సేకరణలో వినియోగిస్తున్న వస్తువులు, పరికరాలను తనిఖీ చేసే విధులను.. తూనికలు, కొలతల శాఖ నుంచి పశుసంవర్థక శాఖకు బదిలీ చేస్తూ మంత్రివర్గం తీర్మానంమావోయిస్టు, వారితోపాటు మరికొన్ని సంస్థలను మరోక సంవత్సర కాలంపాటు నిషేధిస్తూ మంత్రిమండలి తీర్మానం

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. అందులో కొత్తగా ఉద్యోగుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం.