ఏపీలో రాత్రి కర్ఫ్యూ

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ కు జగన్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధిస్తారు.

షాపులు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. థియేటర్లు, మాల్స్‌ను 50 శాతం ఆక్యుపెన్సీ (సీటు మార్చి సీటుకు) అనుమతించాలని.. అలాగే మాస్క్‌ తప్పనిసరి చేయాలన్నారు. అలాగే దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.