ఇకపై ఏపిఎస్ఆర్టీసీ పార్సిళ్ల డోర్ డెలివరీ!

ఏపిఎస్ఆర్టీసీ పార్సిళ్లను ఇకపై డోర్ డెలివరీ చేయనున్నారు. సెప్టెంబరు 1 నుంచి ఈ విధానాన్ని 13 జిల్లాకేంద్రాలు, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లో అమలుచేయాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌కే పార్సిళ్లు బుక్‌ చేస్తున్నారు.

పార్సిల్‌ బుక్‌ చేసుకునేవారు డెలివరీ కావాలంటే అదనపు ఛార్జీ చెల్లించాలి. కేజీ బరువు వరకు జీఎస్టీతోపాటు రూ.15, 1-6 కేజీలకు రూ.25, 6-10 కేజీలకు రూ.30 చొప్పున అదనంగా చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ అల్ట్రాడీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా అమలుచేసేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.