జేపీ నడ్డాకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు. ఈ రోజు జేపీ నడ్డా జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కె.బాలసుబ్రమణ్యంలతో కలిసి జేపీ నడ్డాను కలిసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నడ్డాను ఉద్దేశించి “మీ నాయకత్వంలో తెలంగాణసహా దేశవ్యాప్తంగా పార్టీ మరింతగా బలపడుతోంది. అనేక రాష్ట్రాల్లో పార్టీ విజయాలను అందిపుచ్చుకుంటోంది. కష్టపడే మనస్తత్వం, మీ అంకిత భావం మా అందరికీ స్పూర్తిదాయకం. మీ నాయకత్వంలో పార్టీ విజయాలను సాధించాలి. మీకు దీర్ఘాయువు, ఆరోగ్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా” అని బండి సంజయ్ పేర్కొన్నారు. అనంతరం జేపీ నడ్డాతో కాసేపు సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న ఉద్యమాలపై చర్చించారు.