మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు ఇవే !

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్ కి ప్రాధాన్యం ఇవ్వగా, రెండో విడతలో 45 ఏళ్ళు దాటినా వారికి ప్రాధాన్యత ఇచ్చారు.

మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు

  • 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌.
  • 50శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు కేంద్రం అనుమతి.
  • 50శాతం టీకాలు రాష్ట్రాలకు, విపణిలో అమ్ముకోవచ్చు.
  • ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్‌లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు.
  • ఉత్పత్తి సంస్థలకు నుంచి టీకాలు నేరుగా కొనేందుకు రాష్ట్రాలను అనుమతి.
  • గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ యథావిధిగా కొనసాగుతుంది.