ఓమిక్రాన్ ఎఫెక్ట్ : దిల్లీ ఎయిమ్స్ అలెర్ట్

దిల్లీలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తరుణంలో.. దిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూసుకునేందుకు సిబ్బందికి శీతకాలం సెలవుల్ని రద్దు చేసింది. వెంటనే అందరూ విధుల్లో చేరాలని ఆదేశించింది. దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎయిమ్స్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. కొవిడ్ కారణంగా రెండు మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో 50 మంది బాధితులు చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.