నడి రోడ్డు ఫై నాటు సాంగ్ కు దుమ్ములేపిన యువకుడు

ఆర్ఆర్ఆర్ నుండి రీసెంట్ గా నాటు సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ను చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గకుండా స్టెప్స్ వేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సాంగ్‌ను చాలామంది రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ఓ బామ్మగారు కూడా ఈ ఊరమాస్ ‘నాటు నాటు సాంగ్‌’కు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఆకట్టుకోగా..తాజాగా ఓ యువకుడు మరోలా త‌న వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు.

ఏకంగా ఓ ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద వాహ‌నాలు నిలిచి ఉంటే హెల్మెట్ వేసుకున్న ఓ యువ‌కుడు బైక్ నుంచి దిగి నాటు నాటు వీర నాటు పాట‌కు డాన్స్ వేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ డాన్స్ చూసిన నెటిజ‌న్స్ హెల్మెట్ తీసి డాన్స్ వేసుంటే ఇంకా బావుండేది క‌దా, మంచి గుర్తింపు వ‌చ్చి ఉండేది అని అంటే, కొంద‌రేమో.. ఇలా హెల్మెట్ వేసుకుని గ‌తంలో అల వైకుంఠ‌పురములో సినిమాల్లోని రాములో రాముల సినిమా కూడా ఇలాగే డాన్స్ చేశాడ‌ని అత‌నే ఇత‌ను అని అంటున్నారు.

ఇదెక్కడి మాస్ మామ @RRRMovie #NaatuNaatu #RRRMassAnthem pic.twitter.com/6LOqoQx9Y7— aRRRavind (@KadapaKing9999) November 14, 2021