గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 32 బస్తీ దవాఖానలు

ప్రజా ఆరోగ్యం కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక శ్రద్ద పెట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే బీద ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో ఇప్పటి వరకు 226 బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. వివిధ ప్రాంతాల్లో త్వరలో మరో 32 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో వీటిని ప్రారంభించే చర్యలు చేపట్టారు. కాలనీ పరిధిలో గల కమ్యూనిటీ హాల్స్ ఇతర ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు ప్రజలు విశేష స్పందన వస్తున్న నేపథ్యం లో మరో 32 దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం 300 వరకు బస్తీ దవాఖాన ఏర్పాటు కు నిర్ణహించగా యుద్ద ప్రాతిపదికన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇంకా వివిధ ప్రదేశాల్లో భవనాల సేకరణ, గుర్తింపు పూర్తయిన తర్వాత బస్తీ దవఖానాల ఏర్పాటుకు జిహెచ్ఎంసి కసరత్తు చేస్తున్నది. భవనాలను గుర్తించిన తర్వాత బస్తీ దవాఖాన నిర్వహణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటు ద్వారా వైద్య ఖర్చులు తగ్గి పేదల ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

త్వరలో ప్రారంభించనున్న బస్తీ దవాఖానల వివరాలు

లలిత బాగ్ (36) వార్డులో కొనైన మాజిద్ ఫతేశ నగర్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా రియసాత్ నగర్ (40) కమ్యునిటీ భవన్, కంచన్ బాగ్ (41) వార్డులో మజీద్ ఇ ఒమర్ ఫారూఖి సి బ్లాక్ వైపు క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్, నవాబ్ సాహెబ్ కుంట(47) లోని అచ్చిరెడ్డినగర్ కమ్యునిటీ హాల్, రామ్ నాస్ పుర, చిరాగల్లీ నగర్ కమ్యునిటీహాల్, టోలిచౌకి (68) రేషంబాగ్ ఓవైసి కమ్యునిటీహాల్, పురానాపూల్ (52) జలాల్ కుంచ కమ్యునిటీహాల్ (వార్డు ఆఫీస్), చవాని బాగ్ ఇ జహ్రా కమ్యునిటీహాల్, రెయిన్ బజార్ (31) ముర్తుజానగర్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్, ఖైరతాబాద్ (91) మహాభారత్ నగర్ కమ్యునిటీ హాల్, షేక్ పేట్ (94) రాజీవ్ గాంధీనగర్ కమ్యునిటీహాల్, జూబ్లీహిల్స్ (95/92) సింగడి బస్తీ కమ్యునిటీహాల్, గోషామహల్ (51) దూల్ పేట్ చంద్రకిరణ్ బస్తీ కమ్యునిటీహాల్, మల్లేపల్లి (76) జకీర్ హుస్సేన్ కమ్యునిటీహాల్, గోల్నాక (82) కమగారినగర్ కమ్యునిటీహాల్, యూసుఫ్ గూడ (96) యూసుఫ్ గూడ కమ్యునిటీహాల్, బన్సిలాల్ పేట్ (147) హమాలీబస్త కమ్యునిటీహాల్, నాచారం (6) అన్నపూర్ణ కాలనీ కమ్యునిటీహాల్, చిలుకానగర్ (7) బీరప్పగడ్డ రామాలయం దగ్గర కమ్యునిటీహాల్, అబ్సీగూడ (8) రామంతపూర్ జెడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, ఓల్డ్ బోయిన్ పల్లి (119) ఓల్డ్ బోయిన్ పల్లి వార్డు ఆఫీస్, బాలానగర్ (120) ఫిరోజ్ గూడ వార్డు ఆఫీస్, చింతల్ (128) ఎన్.ఎల్.బి కమ్యునిటీహాల్, సుభాష్ నగర్ (130) అపురూపకాలనీ కమ్యునిటీహాల్, మచ్చబొల్లారం కౌకూర్ మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. వెంకటాపురం (135) గోకుల్ నగర్ పార్కు, నేరెడ్ మెట్ చెక్ పోస్ట్ కమ్యునిటీహాల్ యాప్రాల్, గౌతం నగర్ (141) ఓల్డ్ మిర్జల్ గూడ శ్రీనివాసనగర్ కమ్యునిటీహాల్, హైదర్ నగర్ (123) వార్డు ఆఫీస్ హైదర్ గూడ, శేరిలింగంపల్లి (106) ముస్లీం బస్తీ నెహ్రూనగర్ కమ్యునిటీహాల్, చందానగర్ (110) పాపిరెడ్డి కమ్యునిటీహాళ్లలో ఏర్పాటు చేయనున్నారు.