హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్

భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ప్రయోజనం కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్‌ సర్కారు అంగీకరించింది. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది.