మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

మూడురాజధానుల బిల్లు విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు. మరికాసేపట్లో ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించనున్నారు. అమరావతి రైతులకు ఇది తీపి కబురు అని చెప్పాలి.

ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అవడంతో దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు విచారణలో నేడు మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు.

జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక అసలేం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. మూడురాజధానుల నిర్ణయం వెనుక దీనివెనుక అనేక రాజకీయ కోణాలు వున్నాయి. విశాఖ, కర్నూలు విషయంలో ఏం జరగబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల్ని ఊరిస్తూ వచ్చారు. విశాఖ పాలనా రాజధాని అయితే ఆ ప్రాంతం దశ తిరుగుతుందని ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఏం జరిగిందనేది జగన్ సభలో ప్రకటిస్తారని అంటున్నారు.