జ్యోతుల నెహ్రూ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ ని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ విచ్చేసి నెహ్రూ ని పరామర్శించి ఆరోగ్య విషయాలు చర్చించి హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించి నెహ్రూ త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..

★ నెహ్రూతో నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో కలిసి నడుస్తున్నామని తనకు ఉన్నత పదవులు కన్నా తన ప్రాంతానికి సాగునీరు తాగునీరు కల్పించాలని తపన ఎక్కువగా ఉండేదని అందులో భాగంగానే చాగల్నాడు తీసుకుని చాగల్నాడు ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లిన ఘనత ఆయనదే..

★ అలాగే మెట్ట ప్రాంతానికి పుష్కర ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, మల్లవరం ఎత్తిపోతల పథకం, ఇలా అనేక పథకాలతో గోదావరి నీళ్లు మెట్ట ప్రాంతాల్లో గలగల పారించారు.

★ అదేవిధంగా పోలవరం నిర్వాసితుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ అఖిలపక్ష పార్టీల తో సమన్వయం చేసుకుని నిర్వాసితుల కోసం పోరాటాలు చేస్తున్నారు

★ అందులో భాగంగా ఢిల్లీ వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించి అనారోగ్యం గురికావటం ఆందోళనకరం అన్నారు.

★ ఇటువంటి ప్రజా పోరాటాలు చేసే నాయకులు మన పార్టీకి ఎంతో అవసరమని ఆ భగవంతుడు ఆయనకు పరిపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ఆయన అన్నారు.

★ ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ జ్యోతుల నవీన్, నెహ్రు గారి శ్రీమతి జగ్గంపేట రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి, జ్యోతుల నెహ్రూ గారి కుమార్తె తోట సునీత, కోడలు నవీన్ గారి శ్రీమతి జ్యోతుల లక్ష్మి దేవి మరియు నెహ్రూ గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.