దేశంలో విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ ఎన్‌టీపీసీ

దేశం విద్యుత్ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతూ వ‌స్తోంది. గ్రిడ్ అవసరానికి అనుగుణంగా డిమాండ్‌ను తీర్చడానికి నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టీపీసీ) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎన్‌టీపీసీ సంస్థ సన్నద్ధమైంది మరియు సంస్థ‌ గ్రూప్ స్టేషన్ల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 23 శాతం మేర‌ వృద్ధిని నమోదు చేసింది. సంస్థ పెరుగుతున్న దేశీయ విద్యుత్ అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి ఈ క్రింది చ‌ర్య‌లున చేప‌ట్టింది:

• బొగ్గు విధానపు సౌకర్యవంతమైన వినియోగం కింద ఎన్‌టీపీసీ సంస్థ బొగ్గు నిల్వ‌లు కీల‌క‌మైన‌ స్టేషన్లలో బొగ్గును ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది.

• క్లిష్టమైన స్టేషన్లలో బొగ్గు సరఫరాను పెంచడం, అవసరమైన చోట రేక్‌లను మళ్లించడానికి గాను సంస్థ కోల్ ఇండియా మరియు భార‌తీయ రైల్వేలతో నిరంతర సమన్వయంతో ముందుకు సాగుతోంది.

• గతంలో చేసుకున్న ఒప్పందాలలో మిగిలిపోయిన 2.7 లక్షల మెట్రిక్ టన్నుల మేర బొగ్గును సంస్థ త‌న అవ‌స‌రాల‌కోసం దిగుమ‌తి చేసుకొంది.

• దర్లిపల్లి యూనిట్#2 (800 మెగావాట్లు) యూనిట్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యూనిట్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు 01-09-2021 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. ఈ ప్లాంట్ ఒక పిట్-హెడ్ స్టేషన్ మరియు దీనికి బొగ్గును ఎన్‌టీపీసీ (దులాంగ) క్యాప్టివ్ గని నుండి తీసుకొని వాడుతున్నారు.

• ఎన్‌టీపీసీ యొక్క అన్ని క్యాప్టివ్ గనుల నుండి బొగ్గు ఉత్పత్తిని పెంచారు.

• రాష్ట్రాల‌ను కూడా గ్యాస్ స్టేషన్ల నుండి ఆఫ్‌టేక్ షెడ్యూల్ చేయాలని అభ్యర్థించబడ్డాయి. జనరేటర్ కంపెనీల కోసం గ్యాస్ కోసం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేయడానికి, రాష్ట్రాలు కనీసం ఒక వారం పాటు పవర్ షెడ్యూల్ చేప‌ట్టాల‌ని కూడా అభ్యర్థించబడ్డాయి.