యువ పోలీసు అధికారుల‌తో ప్రధాని మోడీ మాటా మంతీ!

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను కాపాడ‌డంలో అభివృద్ధి, సంక్షేమం కీల‌కపాత్ర పోషిస్తాయ‌ని ప్ర‌ధానమంత్రి మోడీ అన్నారు. హైదరాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్నయువపోలీసు అధికారుల‌ను ఉద్దేశించి ఈరోజు డిజిట‌ల్ మాధ్యమం ద్వారా ప్ర‌సంగించారు.

ఆర్థిక డిజిట‌ల్ మోసాలు అధికారయంత్రాంగానికి పెద్దస‌వాలుగా మారాయ‌ని,ఆర్ధిక డిజిట‌ల్ మోసాల నివార‌ణ‌కు యువ పోలీసు అధికారులు వినూత్న ప‌రిష్కారాలు క‌నుగొనాల‌ని ప్రధానమంత్రి సూచించారు. పోలీసు సంస్క‌ర‌ణ‌లు,మొత్తం పోలీస్ ఫోర్స్ లో ఫిట్‌నెస్‌కు సంబంధించి రాగ‌ల రోజుల‌లో దృష్టిపెట్టాల‌న్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లు ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌ఘ‌డ్ త‌దిత‌ర‌ రాష్ట్రాల కేడ‌ర్ల ఐపిఎస్ ప్రొబేష‌న‌ర్ల‌తో మాట్లాడారు.