నిరుపేద కుటుంబానికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే ..షాక్ తింటారు

ఓ చిన్న ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది..మా అంటే వంద..లేదంటే రెండు వందలు..మహా అయితే ఐదు వందలు అంతకు మించైతే రాదు. కానీ ఇక్కడ మాత్రం ఓ నిరుపేద కుటుంబానికి ఏకంగా రూ. 1,48,371 వచ్చింది. ఆ బిల్లు చూసి సదరు యజమానికి గుండె ఆగినంత పని అయ్యింది. వెంటనే కరెంట్ అధికారుల దగ్గరికి వెళ్లి అయ్యా..అయ్యా మా ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్‌ తప్ప ఏమిలేదయ్యా. అయినాగానీ ఇంత బిల్లు వచ్చిందయ్యా. అంత బిల్లు ఎలా కట్టాలయ్య..అంత ఎందుకు వచ్చిందయ్యా అని అడిగితే వారు రూ. 56,399కి తగ్గించి కట్టాలని చెప్పారు. అంత కూడా కట్టలేం..అని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి మీటర్‌ బాక్సులో ఏదైనా సమస్య ఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప జరిగింది.