రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు

తెలంగాణ లో అద్భుత శిల్ప సంపదకు నెలవైన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం మాత్రమే కాక ప్రపంచ స్థాయి కట్టడమంటూ సంతోషం వ్యక్తం చేశారు అర్చియాలజీ డిప్యూటీ డైరెక్టర్ ‌జాన్‌విజ్‌.

ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.