గురుకులాలు, రెసిడెన్సియల్‌ స్కూళ్లు మూసివేత !

తెలంగాణలో రేపటి(బుధవారం) నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతుల ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఈ రోజు మంగళవారం ప్రకటన జారీచేసింది. గురుకులాలు, రెసిడెన్సియల్‌ స్కూళ్లు మినహా మిగతా వాటికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆఫ్‌లైన్‌తో పాటు అన్‌లైన్‌లోనూ స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు రెసిడెన్షియల్‌, గురుకులాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.