తమిళనాడు ప్రజలకు వరాల జల్లు కురిపించిన స్టాలిన్

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి గా ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేసారు. అందులో ఎముకున్నాయంటే …

  • ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
  • కొవిడ్‌ ఆర్థిక సాయం : రేషన్‌ కార్డు ఉన్న 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4 వేల చొప్పున సాయం. మొదటి విడత కింద ఈ నెలలో రూ.2 వేల చొప్పున జమ.
  • రాష్ట్రంలో లీటర్‌ పాలపై రూ.3 తగ్గింపు