రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సు


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సు రేపు,ఎల్లుండి ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడంపై ఇందులో ప్రధానంగా దృష్టిసారిస్తారు. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన, సమ్మిళిత మానవాభివృద్ధి ద్వారా వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలన్న దానిపై చర్చిస్తారు. గత 3 నెలల్లో నోడల్‌ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్‌, రాష్ట్ర ప్రభుత్వాలు భౌతికంగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 150 సార్లు విస్తృతంగా చర్చించారు. సమావేశాలలో MSME లకు ప్రాధాన్యం ఇవ్వడం, మౌలిక వసతులు, పెట్టుబడులు, నిబంధనలను కనిష్ఠ స్థాయికి తగ్గించడం మహిళల సాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు.