తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు

Corona Tracker

తెలంగాణ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 6,43,716 కేసులు నమోదు అయ్యాయి. 9188 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,796 కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 746 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 70, కరీంనగర్ లో 68 , వరంగల్ అర్బన్ లో 67 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.