ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా రావచ్చు : తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్‌ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలన్నారు. కొత్త వేరియంట్ కట్టడిపై తెలంగాణ CMఅధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు.

ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు, 2 డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్‌ ప్రవర్తన మనం పాటించే కొవిడ్‌ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు (జనవరి లేక ఫిబ్రవరిలో మరో ముప్పు రావొచ్చని) వాస్తవమవుతాయని శ్రీనివాసరావు తెలిపారు.