తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు

Corona Tracker

తెలంగాణ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 6,41,153 కేసులు నమోదు అయ్యాయి. 9405 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,784 కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 710 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 76, కరీంనగర్ లో 49 , వరంగల్ అర్బన్ లో 43 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.