టీఎస్‌ఆర్టీసీ విన్నూత్న ప్రచారం

సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ఎంజీబీఎస్‌లో పలువురు కళాకారులతో ప్రచారం చేయిస్తోంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ ఎండీ సజ్జనార్‌ ఎంజీబీఎస్‌లో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్‌ కళాకారుల ప్రదర్శనను తిలకించి వారిని అభినందించారు. ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు.