రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ

భక్తుల సౌకర్యార్థం ఆగస్టుకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో భక్తులు టికెట్లు, గదులను బుక్‌ చేసుకోవచ్చు.