కరోనా కట్టడిపై సంచలన వాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ప్రపంచంలో ఇప్పటివరకూ 780 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ కోవిడ్‌ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసుస్‌ హెచ్చరించారు. మహమ్మారిని జయించేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. సరైన చర్యల ద్వారా కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని గత కొంత కాలంగా నిరూపితమైందని చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న శక్తిమంతమైన ఆయుధం వ్యాక్సిన్‌ ఒక్కటే కాదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు.