రివ్యూ : అఖండ – పక్కా మాస్ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : బాలకృష్ణ , ప్రగ్య , శ్రీకాంత్ , జగపతి బాబు తదితరులు..
దర్శకత్వం : బోయపాటి
నిర్మాతలు: మిర్యాల రవీందర్
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : డిసెంబర్ 02 , 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.75/5

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈరోజు (డిసెంబర్‌ 2న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి సినిమాకు మరింత హైప్ తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? బోయపాటి తన మార్క్ చూపించాడా లేదా..? అఖండ తో బాలయ్య ఎలాంటి హిట్ అందుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఫ్యాక్షనిజం బాట ప‌ట్టిన అనంతపురం జనాల్లో మార్పు తీసుకరావడమే కర్తవ్యంగా మురళీకృష్ణ (బాలకృష్ణ ) పెట్టుకుంటాడు. అలాగే వారిలో మార్పు తీసుకొస్తాడు. కానీ ఆ ప్రాంతంలో వ‌ర‌ద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని న‌డుపుతుంటాడు. యురేనియం త‌వ్వకాలతో చిన్నారుల ప్రాణాల‌కి ముప్పు ఏర్పడుతుంది. దీంతో మురళీకృష్ణ .. మైనింగ్ మాఫియా భ‌ర‌తం పట్టాలని సిద్ధం అవుతాడు..అదే క్రమంలో శ‌ర‌ణ్య (ప్రగ్యాజైస్వాల్) ముర‌ళీకృష్ణ ప్రేమిస్తుంది. మరి శ‌ర‌ణ్య ప్రేమకు మురళీకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన ముర‌ళీకృష్ణ తోడ బుట్టిన శివుడు (బాల‌కృష్ణ‌) ..మురళీకృష్ణ కు కలుస్తాడా..కలిస్తే ఎలాంటి సాయం చేస్తాడు..? అసలు శివుడు ఎక్కడ పెరుగుతాడు..? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

  • బాలకృష్ణ నటవిశ్వరూపం
  • థమన్ మ్యూజిక్
  • మాస్ సన్నివేశాలు
  • డైలాగ్స్
  • సెకండ్ హాఫ్

మైనస్ :

  • అక్కడక్కడా కాస్త యాక్షన్ సన్నివేశాలు

నటీనటుల తీరు :

  • బాల‌కృష్ణ రెండు పాత్రల్లో తన నట విశ్వరూపం చూపించాడు. అభిమానులు బాలయ్య నుండి ఇంకోరుకుంటున్నారో అదే చూపించి బోయపాటి ఆకట్టుకున్నాడు. డాన్స్, ఫైట్స్ , డైలాగ్స్ ఇలా అన్నిట్లో బాలయ్య కుమ్మేసాడు.
  • ‘లెజెండ్‌’తో జ‌గ‌ప‌తిబాబుని ప్రతినాయ‌కుడిగా మార్చిన బోయ‌పాటి శ్రీను, ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు.
  • జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.
  • ఇక హీరోయిన్ ప్రగ్య తన అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం :

  • థమన్ మరోసారి తన మ్యూజిక్ తో కట్టిపడేసాడు.అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం తెరపై కనిపిస్తుంది. జైబాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా పాటలు అభిమానులను కట్టిపడేశాయి.
  • రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం బాగుంది.
  • ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి.
  • రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ యాక్షన్ ఆకట్టుకున్నాయి.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • ఇక డైరెక్టర్ బోయపాటి మరోసారి తనలోని మాస్ యాంగిల్ ను చూపించారు. తన మాస్ కు బాలయ్య మాత్రమే సెట్ అవుతాడని మరోసారి రుజువైంది. బాలయ్య ను రెండు పాత్రల్లో చూపించి ఆకట్టుకున్నారు. సినిమా అంత కూడా చక్కటి కథ కథనం , డైలాగ్స్ ను ఊపుతెప్పించాడు. కథానాయ‌కుడి ప‌రిచ‌య స‌న్నివేశాలు మొదలుకొని చివ‌రి వ‌ర‌కు ప్రతీ స‌న్నివేశం కూడా బాల‌కృష్ణ మాస్ ఇమేజ్, బోయ‌పాటి మార్క్ థీమ్ మేర‌కు సాగుతుంది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి. ప్రథ‌మార్థం ముర‌ళీకృష్ణ – శ‌ర‌ణ్యల మ‌ధ్య ప్రేమాయ‌ణం, పీఠాధీశుడిని చంపి శ‌క్తి స్వరూపానంద స్వామిగా అవ‌త‌రించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాలతో సాగుతుంది.

ఫైనల్ గా : అఖండ పక్క మాస్ ఎంటర్టైనర్