Site icon TeluguMirchi.com

రివ్యూ : అల్లుడు అదుర్స్ – పర్వాలేదు ‘అల్లుడు ‘

స్టార్ కాస్ట్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్ తదితరులు..
దర్శకత్వం : సంతోష్‌ శ్రీనివాస్‌
నిర్మాతలు: సుమంత్‌ మూవీస్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 14 , 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

కథ :

శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) ..వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని వసుందర మాత్రం శ్రీను ప్రేమను నిరాకరిస్తుంది. దీంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. ఆ తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు. సరిగ్గా ఆ టైం లో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) ఎంటరవుతాడు. తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది. మరి ఆ ఒప్పందం ఏంటి..? గజా( సోనూసూద్ ) కు వసుందర కు సంబంధం ఏంటి..? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడా..లేదా..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

‘కందిరీగ’ లో ఎలాగైతే కన్ఫ్యూజింగ్‌ కామెడీ చూపించి హిట్‌ కొట్టాడో.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గత సినిమా అయిన ‘కందిరీగ’ సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్స్ తోనే నడిపించాడు. సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది.

ఫైనల్ :

పర్వాలేదు అనిపించుకున్న అల్లుడు.

Exit mobile version