రివ్యూ : ‘కిల్’ చేసిన ఖిలాడీ

స్టార్ కాస్ట్ : రవితేజ , డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్ తదితరులు..
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : ఫిబ్రవరి 11, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

ర‌వితేజ, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రీలు జంటగా.. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై కోనేరుస‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ఖిలాడీ. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన రవితేజ.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కరోనా నిబంధనల ఉన్నా.. ఇది భారీ కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘ఖిలాడీ’ అనే సినిమా తో వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? నటి నటుల యాక్టింగ్ ఎలా ఉంది..? అనేది చూద్దాం.

కథ :

గాంధీ (రవితేజ) ఓ అనాధ కావడం తో.. అతణ్ని పెంచి పెద్ద చేస్తాడు రాజశేఖర్ (రావు రమేష్). రాజశేఖర్ అంటే గాంధీకి అమితమైన గౌరవం. ఐతే హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) ముఖ్యమంత్రి సంబంధించి పది వేల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించిన డీల్ లో రాజశేఖర్ తో పాటుగా గాంధీ కుటుంబం ఇరుక్కుపోతుంది. దీంతో గాంధీ జైలు పాలవుతాడు. మరి అతన్ని బయటకి తీసుకొచ్చేందుకు ఒక సైకాలజీ స్టూడెంట్ మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తుంది. మరి ఈ క్రమంలో గాంధీ బయటకు వస్తాడు కానీ రావడంతోనే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు. మరి ఈ కథలో తాను ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ తాను ఆ స్కాం లో ఎలా ఇరుక్కుంటాడు? తనకి డింపుల్ హయాతికి సంబంధం ఏమిటి అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

  • రవితేజ యాక్టింగ్
  • హీరోయిన్స్ గ్లామర్
  • యాక్షన్

మైనస్ :

  • కథ ౦ కథనం
  • బోరింగ్ సన్నివేశాలు
  • క్లయిమాక్స్

నటీనటుల తీరు :

  • రవితేజ తన అభిమానులను మెప్పించేలా కనిపించాడు. ఇంటర్వెల్ వరకు తనకు నప్పని తరహాలో కనిపించి నిరాశ పరిచిన మాస్ రాజా.. తన శైలిలోకి మారాక మాత్రం మంచి ఎనర్జీతో దూసుకెళ్లాడు.
  • డింపుల్ హయతి, మీనాక్షి ఇద్దరు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అందాలు ఆరబోసింది.
  • అనసూయ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను బాగానే చేసింది. ఇప్పటిదాకా ఏ సినిమాలో లేనంత హాట్ గా కనిపించింది.
  • అర్జున్ చేసిన సీబీఐ అధికారి పాత్ర జోకర్ లాగా తయారైంది. తన స్థాయికి తగినట్లు లేదు.
  • రావు రమేష్.. ముకేష్ రుషి.. నికితిన్ ధీర్.. అనూప్.. సచిన్ ఖేద్కర్.. ఇలా విలన్ల జాబితా చాలా పెద్దదే. ఏవీ అంత ప్రభావం చూపించే పాత్రలు కావు. వాళ్లంతా తమ పరిధికి తగ్గట్లు నటించారు. మురళీ శర్మ.. వెన్నెల కిషోర్.. ఉన్ని ముకుందన్ ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం :

  • దేవి శ్రీ మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కూడా అంత అంత మాత్రంగానే ఉంది.
  • శ్రీకాంత్ విస్సా మాటల్లో ఏమంత మెరుపుల్లేవు.
  • నిర్మాణ విలువులు బాగున్నాయి.
  • ఇక కథ-స్క్రీన్ ప్లే రచయిత.. దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే.. అతను చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొంది స్క్రిప్టు తీర్చిదిద్దుకున్నట్లు అనిపిస్తుంది. సీరియస్ థ్రిల్లర్ సినిమాలు తీసే నైపుణ్యం అతడిలో కనిపించలేదు. కథేమో థ్రిల్లర్ శైలిలో రాసుకుని.. దాన్ని కమర్షియల్ సినిమాల శైలిలో తీయడంతో కిచిడిలా తయారైంది.
  • ఫైనల్ : ‘ఖీ’ల్లు చేసిన ఖిలాడీ