రివ్యూ : రాధే శ్యామ్ – నెమ్మదిగా సాగే ప్రేమ ప్రయాణం

నటీనటులు : ప్రభాస్ , పూజా హగ్దే , కృష్ణం రాజు , భాగ్య శ్రీ తదితరులు
డైరెక్టర్ : రాధాకృష్ణ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత : యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
విడుదల తేదీ : మార్చి 11 , 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌ కలయికలో తెరకెక్కిన చిత్రమే ‘రాధే శ్యామ్’. ఈ మూవీ ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటించగా..పూజా ప్రేరణ పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? సినిమాలో ప్లస్ ..మైనస్ ..ఏంటి..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

దేశంలోనే అత్యంత ప్రముఖుడైన హస్త సాముద్రిక జ్యోతిష్కుడు విక్రమాదిత్య (ప్రభాస్). ఇండియా కు ఎమర్జెన్సీ వస్తుందని రోమ్కు వెళ్తాడు. అక్కడ తన తల్లి (భాగ్య శ్రీ ) తో కలిసి ఉంటాడు. తన లైఫ్ లో ప్రేమ , పెళ్లి అనేది లేదని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో ఓ ట్రైన్ ప్రయాణంలో డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి..మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆలా ఆమె వెంటపడి ఆమె ప్రేమను పొందుతాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రేరణ ..చేయి చూసి వంద ఏళ్లు బతుకుతావు అని చెపుతాడు.

మరోపక్క డాక్టర్స్ మాత్రం చనిపోతారని చెపుతారు. ఇదే సమయంలో త్వరలోనే విక్రమాదిత్య చనిపోతాడని ప్రేరణ తెలుసుకుంటుంది..? ఇది తెలుసుకున్న ప్రేరణ తన జీవితానికి ఎలాంటి శిక్ష విధించుకొన్నది? మృత్యువు వెంటాడుతున్న ప్రేరణ, విక్రమాదిత్య జీవితాలకు ఎలాంటి ముగింపు వస్తుంది..? అనేది అసలు కథ .

ప్లస్ :

  • విజువల్స్
  • ప్రభాస్ – పూజా హగ్దే ల కెమిస్ట్రీ
  • నిర్మాణ విలువునాలు
  • సినిమా ఫొటోగ్రఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ :

  • కథనం
  • స్లో గా సాగడం
  • సెకండ్ హాఫ్

నటీనటుల తీరు :

  • ప్రభాస్ ఈ మూవీ లో చాల క్లాస్ గా కనిపించి లుక్ వైజ్ గా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో కొత్త ప్రభాస్‌ను చూడటానికి అవకాశం కలిగింది. కృష్ణం రాజుతో కొన్ని సీన్లలో పోటాపోటిగా నటించాడు. సాహో కంటే ఈ సినిమాలో చాలా ఫ్రెష్ అండ్ స్లైలిష్ లుక్‌లో క‌నిపించారు.
  • ప్రేరణ అనే డాక్టర్‌గా పూజా హెగ్డే తన పాత్రలో ఒదిగిపోయింది. పేషెంట్స్‌కు ప్రాణం పోస్తూనే.. తన ప్రాణాలను కాపాడుకొనే యువతిగా, అలాగే ప్రియుడి ప్రేమ కోసం పరితపించే ప్రేమికురాలిగా పలు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కట్టిపడేసింది. ఫస్టాఫ్‌లో చిలిపిగా కనిపించిన ప్రేరణ, సెకండాఫ్‌లో మెచ్యురిటీ ఉన్న నటనతోపాటు గ్లామర్ పరంగా మెప్పిస్తుంది.
  • కృష్ణం రాజు పాత్ర చిన్నదైనా.. గుర్తుండి పోయే విధంగా ఉంటుంది.
  • పూజా హెగ్డే పెదనాన్నగా సచిన్ ఖేడేకర్ బలమైన పాత్రలో కనిపిస్తాడు. మురళీ శర్మ, ప్రియదర్శి, భాగ్య శ్రీ , తదితరులు వారి వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం :

  • సినిమాటోగ్రఫి సినిమాకు ప్రాణం పోసింది. ఇటలీ, జార్జియా, లండన్, ప్యారిస్ తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్ల అద్భుతంగా చూపించారు.
  • రవీందర్ రెడ్డి వేసిన సెట్స్ సినిమాకు సంబంధించిన ప్రతీ ఫ్రేమ్ ఆహ్లదకరంగా మార్చేలా పరమహంస చేశారనిపిస్తుంది.
  • తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరోసారి కేక పెట్టించాడు. ట్రైన్ ఎపిసోడ్, ఫారెస్ట్‌కు సంబంధించిన సన్నివేశాలు, షిప్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను తన మ్యూజిక్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. పాటలు పెద్దగా బాగాలేవు .
  • ఇక నిర్మాణ విలువలు కథకు మించి ఖర్చు చేసారు. వారు పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ ఫై కనిపిస్తుంది.
  • ఇక డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ విషయానికి వస్తే.. రొటీన్ ప్రేమకథా చిత్రాల‌కు భిన్నంగా ‘రాధే శ్యామ్’ను పీరియాడిక్ మూవీగా యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కించారు. కాకపోతే కథనం ఫై దృష్టి సారిస్తే బాగుండు..సినిమా అంత కూడా స్లో గా సాగడం, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం అభిమానులను నిరాశ పరుస్తుంది. మాస్ యాంగిల్ లో ఇప్పటివరకు ప్రభాస్ ను చూసి ఒకసారి క్లాస్ లుక్ లో చూపించేసరికి పెద్దగా నచ్చలేదు. విజువల్స్ ఫై పెట్టిన దృష్టి కాస్త కథనం ఫై కూడా పెడితే ఇంకాస్త బాగుండేది.

ఓవరాల్ గా : రాధే శ్యామ్ ..నెమ్మదిగా సాగే ప్రేమ ప్రయాణం