Site icon TeluguMirchi.com

రివ్యూ : రంగ్ దే – లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనెర్

న‌టీన‌టులు: నితిన్, కీర్తీ సురేష్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
దర్శకత్వం : వెంకీ అట్లూరి‌
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ‌‌
మ్యూజిక్ : దేవిశ్రీ
విడుదల తేది : మార్చి 26, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్.. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీ చేసాడు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. పాటలు , టీజర్స్ సినిమా ఫై అంచనాలు పెంచడం తో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో పెరిగింది. దానికి తగ్గట్లే ఈరోజు ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. మరి వారి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? అసలు చిత్ర కథ ఏంటి..? మహానటి ఫేమ్ కీర్తి యాక్టింగ్ ఎలా ఉంది..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) చిన్ననాటి నుండి స్నేహితులు. పక్క పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. చదువుల్లో అర్జున్ వెనుకుంటే.. అనుపమ ఎప్పుడూ టాప్ స్కోరర్‌గా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమతోపాటు ద్వేషం కూడా కొనసాగుతుంటుంది. అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొన్న అనుపమ కు తల్లి అడ్డు పడి పెళ్లి ఏర్పట్లు చేస్తుంది. అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక.. ఇష్టం లేని వివాహం చేసుకోలేక పెళ్లి పీటల మీద నుంచి లేచి అర్జున్ ను పెళ్లి చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి త‌ర్వాత వాళ్ల కాపురం స‌జావుగా సాగిందా లేదా..? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అను..ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ తర్వాత అర్జున్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొంటుంది? విడాకులకు సిద్ధమైన అనుపమతో రాజీ చేయడానికి అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు..? అనేది కథ.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం:

మహానటి తర్వాత సక్సెస్ పరంగా తడబాటుకు గురవుతున్న కీర్తీ సురేష్‌కు బలమైన పాత్రను అందించారు. అలాగే నితిన్‌లో కొత్త ఫెర్ఫార్మర్‌ను చూపించాడు. నరేష్, రోహిణి, వినీత్ లాంటి క్యారెక్టర్లతో ఫ్యామిలీ ఎలిమెంట్స్, అభినవ్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ బాగా పండించాడు. కాకపోతే కథలో కొత్తదనం లేకుండా రొటీన్ కథనే రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లోను కాస్త బోరింగ్ సన్నివేశాలు అనిపించాయి.

ఫైనల్ గా :

మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కు బాగానే నచ్చుతుంది..కానీ మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..

Exit mobile version