Site icon TeluguMirchi.com

రివ్యూ : వెంకీమామ – ఫ్యామిలీ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : వెంకటేష్ , నాగ చైతన్య , రాశిఖన్నా , పాయల్ రాజ్ పుత్ తదితరులు..
దర్శకత్వం : బాబీ
నిర్మాతలు: సురేష్ బాబు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : డిసెంబర్ 13, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : వెంకీమామ – ఫ్యామిలీ ఎంటర్టైనర్

తెలుగు చిత్ర సీమలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం వెంకీమామ. వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటించారు. నిజజీవితంలో మామఅల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా అవే రోల్స్ ప్లే చేస్తుండడంతో తో సినిమా ఫై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీ లో వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఉద్యోగిగా కనిపించనున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రావురమేశ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ అలరించారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మాత సురేశ్ బాబు నిర్మించగా దర్శకుడు బాబీ తెరకెక్కించారు. మరి అభిమానుల అంచనాలను సినిమా అందుకుందా..? మామఅల్లుళ్ళ సందడి ఎలా ఉంది..? అల్లుడు కోసం మామ ఏం చేసాడనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

వెంకటరత్నం నాయుడు (వెంకటేష్‌)..మేనల్లుడు కార్తిక్‌ శివరామ్‌ (నాగ చైతన్య) అంటే ప్రాణం. అమ్మ నాన్న లేని తన మేనల్లుడిని ఎంతో గారాబంగా పెంచి పెద్దచేస్తాడు. కార్తీక్ సైతం మేనమామ అంటే ఎంతో ఇష్టం. తాను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అల్లుడ్ని సరిగ్గా చూసుకోదని పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతాడు.

ఈ క్రమంలో తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్‌ వెన్నెల (పాయల్‌ రాజ్‌పుత్‌)తో ప్రేమలో పడతాడు వెంకటరత్నం. అలాగే తన క్లాస్‌మెట్‌ హారిక(రాశీఖన్నా) తో కార్తిక్‌ ప్రేమలో పడతారు. ఇలా ఇద్దరు కూడా ప్రేమలో పడి హ్యాపీగా ఉన్న సమయంలో కార్తీక్‌, వెంకటరత్నంలు విడిపోవాల్సి వస్తుంది. వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వసుంది..? కార్తిక్‌ సైన్యంలోకి ఎందుకు వెళ్లాడు..? మామా అల్లుళ్లు తిరిగి ఎలా కలిశారు..? లేదా..? అన్నదే మిగతా కథ.

ప్లస్ :

* వెంకీ – చైతు

* కామెడీ & ఎమోషనల్

* సినిమాటోగ్రఫి

మైనస్ :

* ఎడిటింగ్‌

* ఆర్మీ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* వెంకటేష్ – చైతు ఇద్దరు కూడా అదరగొట్టారు. వెంకీ మరోసారి తన కామెడీ & ఎమోషనల్ తో అందరికి కన్నీరు తెప్పించాడు. మేనల్లుడిపై అమితమైన ప్రేమానురాగాలున్న మామయ్యగా సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. ఉద్వేగభరితంగా అతడి పాత్ర సాగుతుంది.

* మామయ్య బాగుకోసం తపన పడే అల్లుడిగా నాగచైతన్య చక్కటి నటనను ప్రదర్శించారు. లవర్‌బాయ్‌గా, సైనికుడిగా భిన్నపార్వాలతో అతడి పాత్ర కనిపిస్తుంది.

* ప్రేమికుడి ఆలోచనల్ని గౌరవించే యువతిగా రాశీఖన్నా సముచితమైన పాత్ర దక్కింది.

* పాయల్‌రాజ్‌పుత్ అతిథిగానే ఈ సినిమాలో కనిపిస్తుంది. కామెడీ కోసమే ఆమె పాత్రను సృష్టించారు.

* తర పాత్రల్లో నాజర్‌, ప్రకాష్‌ రాజ్‌, రావూ రమేష్‌, దాసరి అరుణ్‌, హైపర్‌ ఆది, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* తమన్ మరోసారి తన మ్యూజిక్ తో పాటు నేపధ్య సంగీతం తో ఆకట్టుకున్నాడు.

* ప్రసాద్‌ మూరెళ్ల సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. పల్లెటూరి సన్నివేశాలతో పాటు ఆర్మీ ఎటాక్‌, కాశ్మీర్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్‌ సీన్స్‌లో కెమెరామెన్‌ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది

* ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బాగుండు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే..చాల రోజుల తర్వాత పర్ఫెక్ట్ ఫ్యామిలీ కథ ను తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌ కామెడీ, లవ్‌ సీన్స్‌తో సరదా సరదాగా నడిపించాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా తెరకెక్కించాడు. మామా అల్లుళ్లు దూరమవ్వటం ఆ తరువాత జరిగే పరిణామాలు ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌తో కంటతడి పెట్టించాడు. కాకపోతే చైతు ఆర్మీ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు. ఓవరాల్ గా వెంకీమామ – ఫ్యామిలీ ఎంటర్టైనర్.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

Click here for English Review

Exit mobile version