రివ్యూ : ‘వైల్డ్ డాగ్: వైల్డ్ కాదు.. డాగూ లేదు

నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితరులుసంగీతం: ఎస్‌.తమన్‌;
సినిమాటోగ్రఫీ: షానెల్‌ డియోఎడిటింగ్‌: శర్వణ్‌ కత్తికనేని
నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి;
రచన, దర్శకత్వం: అహిషోర్‌ సాల్మన్
సంస్థ: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌

తెలుగుమిర్చి రేటింగ్ : 2.7/5

నాగార్జున వైవిధ్యమైన హీరో. అన్ని జోనర్స్ ని టచ్ చేస్తుంటారు. ప్రయోగాలకు వెనకడుగు వేయరు. ఇప్పుడు ఆయన నుండి మరో వెరైటీ మూవీ వచ్చింది. అదే ‘వైల్డ్ డాగ్’.    ఫస్ట్ లుక్ నుండే ఆసక్తి రేపిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా… ఎన్‌.ఐ.ఎ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో ఓ సారి చూద్దాం..  

కధ: ఏసీపీ విజ‌య్ వ‌ర్మ (నాగార్జున‌)కి వైల్డ్ డాగ్ అని పేరు.  ఉగ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవ‌డం కంటే కూడా అంతం చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటాడు. పూణెలో ఓ బాంబ్ బ్లాస్ట్ జ‌రుగుతుంది. దానికి కార‌ణం.. ఖాలీద్ అనే ఉగ్ర‌వాది. త‌న‌ని ప‌ట్టుకోవ‌డానికి ఎన్‌.ఐ.ఏ విజ‌య్ వ‌ర్మని   నియ‌మిస్తుంది. త‌న టీమ్ తో చేసిన ఆప‌రేష‌నే.. `వైల్డ్ డాగ్‌`.  ఖ‌లీద్ ముంబై మ‌కాం మారుస్తాడు. వైల్డ్ డాగ్ టీమ్… ముంబై వెళ్లి, ఓ వ‌ల ప‌న్నినా చివ‌రి క్షణాల్లో ఖాలీద్ మిస్ అవుతాడు. అక్కడ్నుంచి నేపాల్ పారిపోతాడు. ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి ఈ టీమ్ అన‌ధికారికంగా నేపాల్ వెళ్తుంది. మ‌రి నేపాల్ లో అయినా ఈ ఆప‌రేష‌న్ ఫ‌లించిందా, లేదా? ఖాలీద్ ని ప్రాణాల‌తో ఇండియా ఎలా తీసుకురాగ‌లిగారు? అనేదే మిగిలిన క‌థ‌.

ఎలా వుంది :

2006 నుంచి ఐదారేళ్ల పాటు భార‌త‌దేశంలో జ‌రిగిన బాంబు పేలుళ్ల సంఘ‌ట‌న‌ల్ని… దాని వెన‌క సూత్ర‌ధారుల్ని క‌నిపెట్టి  దేశానికి  తీసుకొచ్చిన ప‌రిణామాల ఆధారంగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ  పేలుళ్లు… వీటి వెనుక కుట్ర‌లు..  దర్యాప్తు సంస్థ‌లు చేసిన ఆప‌రేష‌న్లు…  సూత్ర‌ధారి యాసిన్ భ‌త్క‌ల్‌ని ఇండియాకి తీసుకురావ‌డం…  ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు తెలిసిన విష‌యాలే.  ఐతే వీటిని తెరపై చుపించే ప్రయత్నం చేశారు.

ఇలాంటి కధలకు విచారణ చేసే స్టయిల్ ఆసక్తి కరంగా వుండాలి. ఐతే ఇందులో సీసీ కెమెరాలు చూసి ఆ దాడి ఎవ‌రు చేశారో తెలుసుకోవ‌డం చ‌ప్ప‌గా సాగింది.   ఇన్వెస్టిగేష‌న్ ఇంకొంచెం థ్రిల్లింగ్ గా రాసుకోవాల్సింది. ఆ త‌ర‌వాత ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలే కీల‌కం. ముంబైలో స్కెచ్ వేసి ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించడం, ఖాలీద్ తెలివిగా అక్క‌డ్నుంచి త‌ప్పుకోవ‌డం ఆక‌ట్టుకుంటుంది.

 ఇక  ప్రథ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఇంకో టర్న్ తీసుకుంది. సెకండాఫ్ లో క‌థ నేపాల్ కి షిఫ్ట్ అవుతుంది. నేపాల్ వెళ్ల‌గానే.. `వైల్డ్ డాగ్` టీమ్ మీద ఓ దాడి జ‌రుగుతుంది. ఆ దాడి ఎవ‌రు చేశారు? ఎవ‌రు చేయించారు? అని తెలుసుకోవ‌డం మ‌రో కోణంలో  మారిపోయింది. నిజానికి అది ఈ క‌థ‌కు అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. ఖాలీద్ ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం, విఫ‌లం అవ్వ‌డం… దాదాపు సినిమా అంతా ఇలానే సాగుతుంది. దీంతో చాలా చోట్ల చప్పాగా వుంటుంది.

ఎవరెలా చేశారు ?
నాగార్జున సిన్సియ‌ర్ ఎఫెక్ట్ పెట్టాడు.ఎన్‌.ఐ.ఎ అధికారిగా చూడ్డానికి ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తారు . దియామీర్జా పాత్ర‌కి ప్రాధాన్యం లేదు.  స‌యామీఖేర్ రా ఏజెంట్‌గా క‌నిపిస్తుంది.  వైల్డ్‌డాగ్ టీమ్‌లో క‌నిపించిన న‌లుగురు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  సాంకేతిక విభాగాల్లో షానీల్ డియో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.  త‌మ‌న్ నేప‌థ్య సంగీతం బాగుంది.    నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి

ప్లస్ పాయింట్స్
నాగార్జున
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్
తెలిసిన కధ
స్క్రీన్ ప్లేయ్

చివరిగా .. వైల్డ్ లేదు.. గాడూ లేదు