‘గాంఢీవధారి అర్జున’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్


మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న భారీ రేంజ్‌లో విడుద‌ల కానుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై..’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

వ‌రుణ్ తేజ్‌, సాక్షి వైద్య‌ల మ‌ధ్య సాగే ఈ రొమాంటిక్ మెలోడీ అద్భుతంగా వుంది. మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో ఈ సాంగ్‌ను ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడారు. ఈ పాట విన సొంపుగా ఉంది. క‌చ్చితంగా ఈ సీజ‌న్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు.

ఇక స‌రికొత్త యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో ఇన్‌టెన్స్ యూనిక్ స్టోరీ లైన్‌తో సినిమా అంద‌రినీ మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో వ‌రుణ్ తేజ్‌తో పాటు సాక్షి వైద్య కూడా స్పెష‌ల్ ఏజెంట్‌గా క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్ కనిపించ‌బోతున్నారు. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.