Site icon TeluguMirchi.com

” హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి “

హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయ వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేసారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు తనను అనుమతించక పోవటమే కాక అరెస్టు కూడా చేయటం అన్యాయమని, తనను ఎందుకు అరెస్టు చేసారో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన హెచ్చరించారు. హిందు దేవాలయాలు కూలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, లౌకికవాదం పేరుతో హిందూ వాదాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చార్మినార్ కేవలం చారిత్రక కట్టడమేనని , దానికి కాలపరిమితి ఉంటుందని, దైవానికి ఉండదని స్వామి పేర్కొన్నారు.

Exit mobile version