ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల హవా నడుస్తుంది. తెలుగు చిత్రాలు వివిధ భాషలలో రీమేక్ అవుతుండగా, వేరే భాషలలో హిట్టైన సినిమాలని తెలుగులోకి అనువదిస్తున్నారు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన కప్పెలా చిత్రం తెలుగు లో రీమేక్ చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రం రీమేక్ హక్కులని దక్కించుకోగా, ఈ చిత్రాన్ని ఇద్దరు హీరోలతో తెరకెక్కించనున్నట్టు సమాచారం.
యువ దర్శకుడు కప్పెలా రీమేక్‌ని తెరకెక్కించనుండగా, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఇటీవల పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ దర్శకుడు కప్పెలా చిత్రాన్ని వీక్షించగా, దాని రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.