Site icon TeluguMirchi.com

చిట్టిబాబు గా లారెన్స్ ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో 2018లో వచ్చిన చిత్రం రంగస్థలం. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించగా చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇక ఈ మూవీ ని తమిళం లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అక్కడ ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా రంగస్థలం తమిళ్ వర్షన్ లో హీరోగా మల్టీ టాలెంటెడ్ హీరో లారెన్స్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇప్పటికే లారెన్స్ తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Exit mobile version