పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గుడుంబా శంకర్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన సోదరుడు నాగబాబు తెలిపారు. వీర శంకర్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన ఈ సినిమాని కొణిదెల నాగబాబు నిర్మించారు. మీరా జాస్మిన్‌ కథానాయకిగా నటించింది. అయితే జానీ ప్లాప్ తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కాకపోతే పాటలు మాత్రం అందరినీ అలరించాయి. మరి ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

ఈ మేరకు “ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. ‘గుడుంబా శంకర్’ ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము. ‘జల్సా’ మరియు ‘ఆరెంజ్’ టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని జనసేన పార్టీ ఫండ్‌కి అంకితం చేయబడుతుంది. అలాగే అధికారిక పోస్టర్ వివరాలు త్వరలో తెలుపుతాము” అని నాగబాబు ట్వీట్ చేశారు.