Priyadarshi : ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి మూవీ..


శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ అగ్ర కథానాయిక సమంత ‘యశోద’ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు.‌ లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

Also Read :  Sarangapani Jathakam : 'సారంగపాణి జాతకం' గ్రాండ్ సక్సెస్.. టీమ్ హ్యాట్రిక్ హిట్ సెలబ్రేషన్స్ !

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో వచ్చిన తొలి సినిమా నాని ‘జెంటిల్ మన్’ బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా ‘సమ్మోహనం’ చేశారు. ఇక ఇప్పుడు చేయబోయేది వాళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా. ఇందులో ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. హీరోగా ‘బలగం’ సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రియదర్శి ‘ఓం భీం బుష్’ సినిమా చేస్తున్నాడు.

Also Read :  Sarangapani Jathakam : 'సారంగపాణి జాతకం' గ్రాండ్ సక్సెస్.. టీమ్ హ్యాట్రిక్ హిట్ సెలబ్రేషన్స్ !