Site icon TeluguMirchi.com

కరోనా టైం లో పది కోట్లా అప్పా..?

ప్రస్తుతం కరోనా టైం నడుస్తుంది..ఏమిచేయాలి పరిస్థితి. కరోనా కారణంగా సినిమాలు ఆగిపోయాయి. అనేక సంస్థలు మూతపడ్డాయి. ఈ టైం లో ఓ నిర్మాత పది కోట్లు అప్పుగా తీసుకున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఓ సూపర్ స్టార్ తరువాత సినిమా తనదే అని, అందుకోసం అడ్వాన్స్ అర్జెంట్ ఇవ్వాలని 10 కోట్ల అప్పు చేసాడట.

ఎవరా సూపర్ స్టార్, ఏమా సినిమా, ఎవరా డైరక్టర్ అన్నది పక్కాగా అన్నీ రూఢీ చేసుకున్నాకే పది కోట్ల అప్పు నగదు రూపంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. గతంలో చిన్న పెద్ద సినిమాలు ఎన్నో తీసిన ఆ నిర్మాత, సదరు సూపర్ స్టార్ తో కూడా సినిమాలు తీసారు. మళ్లీ మరోసారి సినిమా చేసుకునే అవకాశాన్ని ఆ హీరో ఇచ్చినట్లు..అందుకే ఆ నిర్మాత అప్పు చేసినట్లు అంటున్నారు

Exit mobile version