Site icon TeluguMirchi.com

ఆగస్టు లో కూడా వకీల్ కష్టమే..

కరోనా మహమ్మారి వచ్చి వకీల్ సాబ్ ను సెట్స్ పైనే ఉచింది. చాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ ను తెలుగు లో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం తో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఆగష్టు ఫస్ట్ వీక్ లో షూట్ తిరిగి మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోన్నా.. ప్రస్తుత కరోనా పరిస్థితి చూసి ఇప్పట్లో సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడమే మంచిందని డిసైడ్ అయ్యారట. సో కరోనా తగ్గే వరకు ఏ సినిమా షూటింగ్ కూడా మొదలు కానట్లే ఉంది.

Exit mobile version