కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ యాప్ గురించి తెలుసా ?

రాష్ట్రంలో కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్‌ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. ఇక మెడికల్‌ షాపుల యజమానులు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలని పేర్కొంది. లాగిన్‌ అయ్యాక మొబైల్‌ నంబర్‌ లేదా మెడికల్‌ షాపు ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది.