Site icon TeluguMirchi.com

దసరా సందర్భాంగా తగ్గిన కార్ల ధరలు..

వాహనప్రియులకు దసరా ఆఫర్లను ప్రకటించాయి కార్ల తయారీ సంస్థలు..కొత్త కార్ కొనేవారికి తీపి కబురు అంటూ పలు సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చాయి. వాటిలో మారుతి, హ్యుండాయ్, మహీంద్రాలాంటి కంపెనీలు భారీగా తమ కార్లకు డిస్కౌంట్ ను ప్రకటించాయి. శుక్రవారం నుంచి ఈ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ, మోడల్‌ను బట్టి రూ.లక్షకుపైగా డిస్కౌంట్లతోపాటు క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ బోనస్, ఇతర అన్ని లాభాలు కలుపుకొని అత్యధికంగా రూ.9.5 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది.

డిస్కౌంట్ ప్రకటించిన కార్ల వివరాలు వాటి ధరలు చూస్తే..

* మహీంద్రా రెక్స్‌టన్ (డిస్కౌంట్ రూ.9.5 లక్షల వరకు)
* హోండా సీఆర్-వీ ప్రి-ఫేస్‌లిఫ్ట్ (డిస్కౌంట్ రూ.1.5 లక్షల వరకు)
* హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 (డిస్కౌంట్ రూ.1.35 లక్షల వరకు)

Exit mobile version